ఆప్రదేశంబునకు సరమయను దేవశుని కొడుకు సారమేయుండను కుర్కుర
కుమారుండు క్రీడార్థంబు వచ్చి క్రుమ్మరుచున్న నలిగి జనమేజయు తమ్ములు
శ్రుతసేనుండును నుగ్రసేనుండును ననువార లాసారమేయు నడిచిన నది యఱ
చుచుం బఱతెంచి తనతల్లికిం జెప్పిన నాసరమయు నతికోపాన్వితయై జనమే
జయునొద్దకు వచ్చి యిట్లనియె.

(ఆ ప్రదేశానికి, సరమ అనే పేరు గల దేవతల కుక్కకు కొడుకైన సారమేయుడనే కుక్కపిల్ల వచ్చి ఆడుకోసాగింది. అందుకు జనమేజయుని తమ్ములైన శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు కోపించి సారమేయుని కొట్టగా, ఆ కుక్కపిల్ల ఏడుస్తూ తన తల్లి అయిన సరమకు ఆ విషయం చెప్పింది. ఆమె కోపంతో జనమేజయుని వద్దకు వచ్చి ఇలా అన్నది.)
No comments:
Post a Comment