Friday, August 26, 2005

1_1_33 వచనము హర్ష - విజయ్

వచనము

ఆదియునుం బౌష్యంబు పౌలోమం బాస్తీకం బాదివంశావతారంబు సంభవ
పర్వంబు జతుగృహదాహంబు హైడింబంబు బకవధ చైత్రరథంబు ద్రౌపదీ
స్వయంవరంబు వైవాహికంబు విదురాగమనంబు రాజ్యార్ధలాభం బర్జున
తీర్థయాత్ర సుభద్రాకల్యాణంబు హరణహారిక ఖాండవదహనంబు మయ
దర్శనంబు సభాపర్వంబు మంత్రపర్వంబు జరాసంధవధ దిగ్విజయంబు
రాజసూయం బర్ఘ్యాభిహరణంబు శిశుపాలవధ ద్యూతం బనుద్యూతం బార
ణ్యంబు కిమ్మీరవధ కైరాతం బింద్రలోకాభిగమనము ధర్మజతీర్థయాత్ర
జటాసురవధ యక్షయుద్ధం బాజగరంబు మార్కండేయోపాఖ్యానంబు సత్యా
ద్రౌపదీ సంవాదంబు ఘోషయాత్ర ప్రాయోపవేశంబు వ్రీహిద్రోణకాఖ్యా
నంబు ద్రౌపదీహరణంబు కుండలాహరణం బారణేయంబు వైరాటంబు
కీచకవధ గోగ్రహణం బభిమన్యువివాహం బుద్యోగంబు సంజయయానంబు
ధృతరాష్ట్ర ప్రజాగరణంబు సానత్సుజాతంబు యానసంధి భగవద్యానంబు
సేనానిర్యాత్ర యులూక దూతాభిగమనంబు సమరథాతిరథసంఖ్యానంబు కర్ణ
భీష్మవివాదం బంబోపాఖ్యానంబు జంబూఖండ వినిర్మాణంబు భూమి
పర్వంబు భీష్మాభిషేకంబు భగవద్గీత భీష్మవధ ద్రోణాభిషేకంబు సంశ
ప్తకవధ యభిమన్యువధ ప్రతిజ్ఞాపర్వంబు జయద్రథవధ ఘటోత్కచవధ
ద్రోణవధ నారాయణాస్త్ర ప్రయోగంబు కర్ణపర్వంబు శల్యపర్వంబు హ్రద
ప్రవేశంబు గదాయుద్ధంబు సారస్వతంబు సౌప్తికపర్వం బైషీకంబు జల
ప్రదానంబు స్త్రీపర్వంబు శ్రాద్ధపర్వంబు రాజ్యాభిషేకంబు చార్వాకనిగ్ర
హంబు గృహప్రవిభాగంబు శాంతిపర్వంబు రాజధర్మానుకీర్తనం బాపద్ధ
ర్మంబు మోక్షధర్మం బానుశాసనికంబు భీష్మస్వర్గారోహణం బాశ్వమేధికం
బనుగీత యాశ్రమవాసంబు పుత్త్రసందర్శనంబు నారదాగమనంబు మౌస
లంబు మహాప్రస్థానికంబు స్వర్గారోహణంబు హరివంశంబు భవిష్య
త్పర్వంబు ననుశతపర్వంబులు గలిగి.

























(ఆ భారతం (పైన పేర్కొన్న) శతపర్వాలను కలిగి)

No comments: