అక్కథకుండు వెండియు నమ్ముని సంఘంబునకు నమస్కారంబు చేసి యే
ననేక పురాణపుణ్యకథాకథనదక్షుండ వ్యాసశిష్యుండైన రోమహర్షణునకుఁ
బుత్త్రుండ నావలన నెక్కథ విన వలతు రనిన నమ్మును లతని కిట్లనిరి

(ఆ కథకుడు మళ్లీ ఆ మునులకు నమస్కారం చేసి, "నేను అనేకపురాణాలలోని పుణ్యకథలను చెప్పటంలో సమర్థుడిని, వ్యాసశిష్యుడైన రోమహర్షణుని కుమారుడిని, నానుండి మీరు ఏ కథ వినాలని కోరుతున్నారు?", అనగా ఆ మునులు ఇలా అన్నారు.)
No comments:
Post a Comment