గరుడసంభవంబును సముద్రమథనంబు నుచ్చైశ్శ్రవోజన్మంబును సౌపర్ణో
పాఖ్యానంబును నాస్తీకచరితంబును జనమేజయసర్పయాగంబును శ్రీ మహా
భారతకథాశ్రవణప్రవృత్తియు వ్యాసజన్మంబును దేవదైత్యదానవముని
యక్షపక్షిగంధర్వాది నానావిధభూతసంభవంబును దదంశావతారంబును రాజ
వంశానుకీర్తనంబును యయాతిచరితంబును భారతవంశానుకీర్తనంబును
గంగాశంతనుసమాగమంబును వస్తూత్పత్తియు స్వర్గగమనంబును దదంశ
సంఘాతంబున గాంగేయజన్మంబును దద్రాజ్యనివర్తనంబును బ్రహ్మచర్య
ప్రతిజ్ఞాపరిపాలనంబును సత్యవతీవివాహంబును జిత్రాంగద విచిత్రవీర్య
జన్మంబును జిత్రాంగద రాజ్యాభిషేకంబును జిత్రాంగద మరణానంతరంబున
భీష్ముండు విచిత్రవీర్యుం గౌరవరాజ్యంబున నభిషిక్తుం జేయుటయు వాని
పరోక్షంబునఁ గృష్ణద్వైపాయనమునివలన ధృతరాష్ట్ర పాండురాజుల
జన్మంబు నాణిమాండవ్యోపాఖ్యానంబును ధర్ముండు మాండవ్య శాపంబున
శూద్రయోనియందు విదురుండై పుట్టుటయును ధృతరాష్ట్రపాండురాజుల
వివాహంబును బాండవధార్తరాష్ట్రసంభవంబును బాండునిర్యాణంబును గృప
ద్రోణజన్మకథనంబును గుమారాస్త్రవిద్యాగ్రహణంబును గుమారాస్త్రసందర్శ
నంబును గర్ణార్జునుల పరస్పర క్రోధంబును ద్రుపదగ్రహణమోక్షణంబును
యుధిష్టిరుయౌవరాజ్యాభిషిక్తుం జేయుటయు దుర్యోధను దుర్మంత్రంబును
వారణావతయాత్రయు జతుగృహదాహంబును విదురోపదిష్టద్వారంబునఁ
బాండవాపక్రమణంబును హిడింబాదర్శనంబును హిడింబువధయును ఘటో
త్కచసంభవంబును బాండవుల కేకచక్రపురంబున విప్రగృహంబున నజ్ఞాత
చర్యయు బకవధయు ధృష్టద్యుమ్న ద్రౌపదీజన్మకథనంబును గృష్ణద్వైపా
యన సందర్శనంబును గంగాతీరంబున నంగారపర్ణు నర్జునుండు జయించు
టయుఁ దాపత్యవసిష్ఠౌర్వోపాఖ్యానంబును బాండవులు పాంచాలదేశంబు
నకుం జనుటయు ద్రౌపదీస్వయంవరంబును బంచేంద్రోపాఖ్యానంబును
ద్రౌపదీవివాహంబును విదురాగమనంబును గృష్ణసందర్శనంబును రాజ్యార్ధ
లాభంబును ఖాండవప్రస్థనివాసంబును సుందోపసుందోపాఖ్యానంబును
నారదువచనంబున ద్రౌపదియందు సమయక్రియయును నులూపీసమాగమం
బును జిత్రాంగదయందు బభ్రువాహను జన్మంబును ద్వారకా గమనంబును
వాసుదేవానుమతంబున నర్జుడుఁడు సుభద్ర వివాహం బగుటయు సుభద్రా
హరణంబును హరణహారికయు నభిమన్యుసంభవంబును గాండీవదేవదత్త
దివ్యరథాశ్వలాభంబును ఖాండవదహనంబు నగ్నిభయంబువలన మయ
భుజంగమోక్షణంబును మందపాలోపాఖ్యానంబును ననువృత్తాంతంబుల
నొప్పి తొమ్మిదివేలుందొమ్మన్నూటయెనుబదినాలుగు శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 9984 శ్లోకాలు కలిగి.)
No comments:
Post a Comment