Friday, August 26, 2005

1_1_45 వచనము విజయ్ - ప్రవీణ్

వచనము

మఱియు జంబూఖండవినిర్మాణంబు సంజయుండు ధృతరాష్ట్రునకుం జెప్పుటయు
భూవిస్తారంబును భీష్మాభిషేకంబును బాండవమధ్యమవిషాదంబును
వాసుదేవుండు మోక్షదర్శనహేతువులం జెప్పి యర్జును మోహభ్రాంతిఁ
జెఱుచుటయు శిఖండిం బురస్కరించుకొని యర్జునుండు భీష్ముని వధియించుటయు
నను వృత్తాంతంబుల నొప్పి యైదువేలు నెనమన్నూట యెనుబది
నాలుగు శ్లోకంబులు గలిగి.









(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 5884 శ్లోకాలు కలిగి.)

No comments: