Friday, August 26, 2005

1_1_47 వచనము విజయ్ - ప్రవీణ్

మఱియు ద్రోణాభిషేకంబును సంశప్తకు లర్జునుం బాపికొనిపోయి యేకతంబు
యుద్ధంబు సేయుటయు నర్జునుచేత సుప్రతీకగజంబు తోడన భగదత్తు
చావును ద్రోణ కర్ణాదులు పెక్కండ్రు గూడుకొని యధర్మయుద్ధంబున నభిమన్యుం
జంపుటయు నర్జునుప్రతిజ్ఞయు నభిమన్యువధకుం గ్రుద్ధుండై
యర్జునుం డేడక్షౌహిణుల బలంబుల నొక్కరుండ చంపి సైంధవుం దునుముటయును
దొమ్మిది కోట్లు సంశప్తకుల నర్జునుండు నిశ్శేషంబు సేయుటయు
నలంబస శ్రుతాయు జలసంధ సోమదత్త భూరిశ్రవో బాహ్లిక విరాట
ద్రుపద ఘటోత్కచ ధార్తరాష్ట్ర నారాయణ గోపాలాది వధయును ద్రోణవధయు
నశ్వత్థామ నారాయణాగ్నేయాస్త్రకీర్తనంబును గృష్ణార్జునుల
మాహాత్మ్యంబును ననువృత్తాంతంబుల నొప్పి పదివేలుం దొమ్మన్నూట
పందొమ్మిది శ్లోకంబులు గలిగి.














(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 10919 శ్లోకాలు కలిగి.)

No comments: