మఱియు ధృతరాష్ట్రుండును గాంధారియు రాజ్యంబు విడిచి విదురసంజయ
సహితంబుగా నాశ్రమవాసంబునకుఁ జనుటయు సకలరాజ్యభారధౌరేయులైన
కొడుకుల విడిచి కుంతీదేవి గురుశుశ్రూషాపరయయి వారి పిఱుందన పోవుటయు
సమరనిహతులైన పుత్త్రపౌత్త్రుల నెల్ల ధృతరాష్ట్రుండు వ్యాసవరప్రసాదంబునఁ
గాంచి విగతశోకుండయి గాంధారీ కుంతీ విదుర సంజయులతోఁ
బరమసిద్ధికిం జనుటయుఁ బాండవులు నారదువలన నిఖిలయాదవ
వ్యసనం బెఱుంగుటయు నను వృత్తాంతంబుల నొప్పి వేయునూటయాఱు
శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 1106 శ్లోకాలు కలిగి.)
No comments:
Post a Comment