వచనము
అఖిలజలధివేలావలయితవసుమతీవనితావిభూషణంబైన వేంగీదేశంబునకు
నాయకరత్నంబునుంబోని రాజమహేంద్రపురంబునందు మహేంద్రమహిమ
తోఁ బరమానందంబున ననవరతమహామహీరాజ్యసుఖంబు లనుభవించుచు
సకలభువనలక్ష్మీవిలాసనివాసంబయిన రమ్యహర్మ్యతలంబున మంత్రి
పురోహిత సేనాపతి దండనాయక దౌవారిక మహాప్రధాన సామంత విలాసినీ
పరివృతుఁడయి యపారశబ్దశాస్త్రపారగులైన వైయాకరణులును భారత
రామాయణానేకపురాణప్రవీణులైన పౌరాణికులును మృదుమధురరసభావ
భాసురనవార్థవచనరచనావిశారదులయిన మహాకవులును వివిధతర్కవిగా
హితసమస్తశాస్త్రసాగరగరీయ:ప్రతిభులైన తార్కికులును నాదిగాఁ గలుగు
విద్వజ్జనంబులు పరివేష్ఠించి కొలుచుచుండ విద్యావిలాసగోష్ఠీసుఖోపవిష్టుం
డయి యిష్టకథావినోదంబుల నుండి యొక్కనాఁడు.
(భూమి అనే స్త్రీకి అలంకారమైన వేంగీదేశానికి నాయకరత్నం వంటి రాజమహేంద్రపురంలో రాజ్యసుఖాలనుభవిస్తూ లక్ష్మీనివాసమైన రమ్యహర్మ్యతలంలో రాజోద్యోగులు, కవులు, పండితులు చుట్టూ ఉండగా విద్యాగోష్ఠులతో సుఖంగా కూర్చుండి, ఇష్టకథలతో ఉండి ఒకరోజున.)
Thursday, August 25, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment