మఱియు ధర్మరాజునకు సభాప్రాప్తియుఁ గింకరదర్శనంబును నారదువలన
లోకపాల సభాశ్రవణంబును రాజసూయ మహాధ్వరారంభంబును జరాసంధ
వధయును గిరివ్రజనిరుద్ధులైన రాజులఁ గృష్ణుండు విడిపించుటయును
దిగ్విజయంబును రాజసూయంబు నర్ఘ్యాభిహరణంబును శిశుపాలవధయును
రాజసూయవిభూతికి దుఃఖితుండై సభాస్ఖలితుండై యున్న దుర్యోధనుంజూచి
ద్రౌపదీభీమసేనులు నగుటయును దత్కారణంబున జూదం బాడుటయు
నందు శకునికైతవంబున ధర్మరాజపరాజయంబును ద్యూతదుఃఖార్ణ
వమగ్నులైన పాండవులం బాంచాలి యుద్ధరించుటయును బునర్ద్యూతపరా
జితులై పాండవులు వనవాసగతు లగుటయునను వృత్తాంతంబుల నొప్పి
నాలుగువేలున్ మున్నూటపదునొకండు శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 4311 శ్లోకాలు కలిగి.)
No comments:
Post a Comment