మఱియు విరాటనగరంబునకుం జనుచుండి తత్సమీపశమీవృక్షంబునఁ బాండవులు
తమ యాయుధంబులు నిక్షేపించి తమ్మెవ్వరు నెఱుంగకుండ విరాటుం
గొలిచి యునికియు నందు భీముండు సింహబలుం దొట్టి సకల కీచకుల వధించుటయు
గోగ్రహణంబునఁ గురుబలంబుల నెల్ల నొక్కరుండ జయించి
ధనంజయుండు గోగణంబులఁ గ్రమ్మఱించుటయు విరాటరాజపుత్త్రియైన
యుత్తర నభిమన్యుండు వివాహం బగుటయు నను వృత్తాంతంబుల నొప్పి
మూఁడు వేలు నేనూఱు శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 3500 శ్లోకాలు కలిగి.)
No comments:
Post a Comment