Friday, August 26, 2005

1_1_43 వచనము హర్ష - విజయ్

వచనము

మఱియు భారతరణోద్యోగులైన పాండవు లుపప్లావ్యంబున విడియుటయు
నర్జునదుర్యోధనులు ద్వారకానగరంబునకుం జని శ్రీకృష్ణునిం గని సహాయ
త్వంబునకుం బ్రార్థించుటయు నారాయణుండు వారి నాశ్వాసించి నారాయణ
గోపాలబలంబుల నిరూపించి వారలం గోరికొం డనుటయు నారాయణుని
నొక్కని నర్జునుండు గోరికొనుటయు ధృతరాష్ట్రుండు వనుప నుపశమనార్థం
బుపప్లావ్యంబున సంజయుండు పాండవుల కడకుం బోవుటయు వాసుదేవ
సహితులైన పాండవుల రణప్రారంభంబు విని ధృతరాష్ట్రుండు నిద్రాహారం
బులు విడిచి చింతాక్రాంతుం డగుటయు హితవచనుండైన విదురు పల్కులు
వినమియు ధృతరాష్ట్రునకు మనస్తాపోపశమనంబుగా సనత్సుజాతుం డధ్యాత్మ
కథలు సెప్పుటయు వాసుదేవార్జునుల యత్యంతసాంగత్యం బెఱింగి వచ్చి
సంజయుండు సకల రాజసమక్షంబున విస్తరించుటయు సర్వభూతహితుండైన
శ్రీకృష్ణుండు పాండవ ధార్తరాష్ట్రులకు సంధి గావింపం దలంచి హస్తిపురం
బునకుం జని యందుఁ గర్ణాది దుష్టశిక్షితుండైన దుర్యోధను దుర్మంత్రం
బెఱింగి విశ్వరూపంబుఁ జూపుటయుఁ గృష్ణుండు కర్ణునిం దన రథం బెక్కిం
చుకొని యుపాయంబున ననునయించి యొడంబఱుప నేరక కర్ణుచేతం
బ్రత్యాఖ్యాతుండయి క్రమ్మఱి వచ్చుటయు బలాతిబలసంఖ్యానంబు నెల్లి
యుద్ధంబు సేయవలయునని కురుపతి పనుప నులూకుండను దూత పాండవుల
పాలికి వచ్చి పరుసంబులు పలుకుటయు సమరథాతిరథసంఖ్యానంబు నర్ధరథు
లలోనం గలయం దన్నెన్నిన నలిగి కర్ణుండు భీష్ము పదిదినంబులు సమర
పరాఙ్ముఖుం డగుటయు రామభీష్ముల యుద్ధ కీర్తనంబు నంబోపాఖ్యానంబును
సంక్రందనోపాఖ్యానంబును శ్వేతాభిషేకంబు ననువృత్తాంతంబుల నొప్పి
యాఱువేలుం దొమ్మన్నూట తొంబది యెనిమిది శ్లోకంబులు గలిగి.






















(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 6998 శ్లోకాలు కలిగి.)

No comments: