మఱియుఁ గర్ణాభిషేకంబును గర్ణునకు రథంబు గడప శల్యుం బూన్చుటయుఁ
ద్రిపురదహనోపాఖ్యానంబును కర్ణశల్యుల పరస్పర వివాదంబును హంస
కాకీయోపాఖ్యానంబును యుధిష్ఠిరార్జునుల పరస్పర క్రోధవచనంబులు నర్జు
నానునయంబును వృషసేనువధయును దుశ్శాసనుం జంపి భీముండు తద్వక్షో
రక్తం బాస్వాదించుటయు విప్రశాపనిమిత్తంబునఁ గర్ణురథచక్రంబు
భూమియందుఁ గ్రుంగుటయు నాగాస్త్రభయంబున నర్జునురథంబు శ్రీకృష్ణుండు
భూమియందుఁ జొనుపుటయు నింద్రాదిత్యుల పరస్పర సంవాదంబును గర్ణు
వధయును నను వృత్తాంతంబుల నొప్పి నాలుగు వేలుం దొమ్మన్నూఱు
శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 4900 శ్లోకాలు కలిగి.)
No comments:
Post a Comment