వచనము
మఱియు భీముగదాభిఘాతంబున దుర్యోధనుండు తొడలు విఱిగిపడిన బాండవులు రణం బుపసంహరించి చనిన నాఁటి రాత్రి కృపకృతవర్మాశ్వత్థామలు పాండవశిబిరంబుపయిం జనుటయు నందశ్వత్థామ కోపోద్దీపితుండై తన ప్రతిజ్ఞదీఱ ధృష్టద్యుమ్నపురోగము లైన సర్వపాంచాలురను బ్రతివింధ్యాదిద్రౌపదేయులను బాండవామాత్యులను సుఖసుప్తులయినవారి వధించుటయు నందు శ్రీకృష్ణప్రసాదంబునఁ బాండవులేవురు సాత్యకియుం దప్పుటయుఁ బుత్త్రభ్రాతృవధదుఃఖితయై పాంచాలి యనశనంబు సంకల్పించుకొనుటయు దద్వచనంబున భీముం డశ్వత్థామ పిఱుందం జనుటయు భీమసేనభయార్తుండయి యశ్వత్థామ యుపాండవం బయ్యెడ మని శరమోక్షణంబు సేయుటయు నట్లు గాకుండెడమని శ్రీకృష్ణుండు దానిం బరిహరించుటయు దాని దునియ నర్జునుండు తన దివ్యబాణంబున నేయుటయు వ్యాసాశ్వత్థామల యన్యోన్య శాపంబులు నశ్వత్థామ శిరోరత్నంబుఁ బాండవులు గొనుటయు నను వృత్తాంతంబుల నొప్పి రెండు వేలు నెనమన్నూట డెబ్బది శ్లోకంబులు గలిగి.
(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 2870 శ్లోకాలు కలిగి.)
Friday, August 26, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment