మఱియు బంధువర్గంబునెల్ల వధియించి పరమనిర్వేదనపరుండై కృష్ణువచ
నంబుల శాంతుండైయున్న ధర్మజునకు శరతల్పగతుండైన భీష్ముండు ధర్మ
విదులయిన రాజులకెల్ల హితంబుగా రాజధర్మంబులు నాపద్ధర్మంబులు నేవాని
నెఱింగిన సర్వజ్ఞానసంపన్ను లగుదు రట్టి మోక్షధర్మంబులుఁ జెప్పుటయునను
వృత్తాంతంబుల నొప్పి పదునాలుగు వేల నేనూట యిరువదియైదు శ్లోకం
బులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 14525 శ్లోకాలు కలిగి.)
No comments:
Post a Comment