మఱియు నశ్వమేధారంభంబును సంవర్తమరుత్తీయోపాఖ్యానంబును
స్వర్ణకోశసంప్రాప్తియు నుత్తరగర్భంబున నశ్వత్థామాస్త్రదగ్ధుండై శ్రీకృష్ణుచేత
సంజీవితుండయిన పరీక్షితుని జన్మంబు నర్జును నశ్వానుసరణంబు నెడనెడ
రాజులతోడి యుద్ధంబును జిత్రాంగదపుత్త్రుండైన బభ్రువాహనుం డాహవంబున
నర్జునుం బరిభవించుటయు నశ్వమేధ మహాయజ్ఞంబునందు నకులోపాఖ్యానంబును
ననుగీతయు బ్రాహ్మణగీతయు గురుశిష్యసంవాదంబును ననువృత్తాంతంబుల
నొప్పి నాల్గువేలు నన్నూట యిరువది శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 4420 శ్లోకాలు కలిగి.)
No comments:
Post a Comment