Friday, August 26, 2005

1_1_55 వచనము ఆదిత్య - సందీప్

వచనము

మఱియు వీరపత్నీవిలాపంబును గాంధారీధృతరాష్ట్రుల కోపప్రసా
దంబులును ధర్మజుండు రణనిహతులైన పితృపితామహాభ్రాతృపుత్త్ర
భృత్యామాత్యమాతులాచార్య మిత్రాదులం బరీక్షించి యథావిధి సంస్క
రింపం దగువారలం బంచుటయు భారతవీరుల కుదకదానంబు సేయు
టయుఁ దత్సమయంబునఁ గుంతీదేవి పాండవులకుఁ గర్ణుండు గూఢో
త్పన్నుండని యెఱింగించుటయు ధర్మజువిలాపంబును ధర్మజురాజ్యాభి
షేకంబును చార్వాకనిగ్రహంబును గృహప్రవిభాగంబును ననువృత్తాం
తంబుల నొప్పి వేయునేడునూటడెబ్బదియైదు శ్లోకంబులు గలిగి.











(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 1775 శ్లోకాలు కలిగి.)

No comments: